మార్కాపురం: ఆక్రమణలను పరిశీలించిన సబ్ కలెక్టర్

60చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆక్రమణలను గురువారం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ పరిశీలించారు. ఇప్పటికే అధికారులు ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. వారం రోజులలోపు ఆక్రమణదారులు ఆక్రమణలను తొలగించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. లేదంటే సంబంధిత శాఖ అధికారులతో ఆక్రమణలను తొలగిస్తామని వెంకట్ త్రివినాగ్ హెచ్చరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్