పొదిలి మండలం మాదిరెడ్డిపల్లి వద్ద శనివారం అదుపుతప్పి ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు కొనకలమిట్ల మండలం తూపాడు గ్రామానికి చెందిన డానియేలు(60)గా పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ డానియల్ ను వైద్యం కోసం పొదిలికి తరలించి తర్వాత ఒంగోలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. క్షతగాత్రులు అందరూ కొనకలమిట్ల చెందిన వారిని పోలీసులు వివరాలు వెల్లడించారు.