జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని విద్యుత్ శాఖ ఎస్. ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం వారు మాట్లాడుతూ.. విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశామని, వర్షంలోనూ విద్యుత్ సిబ్బంది పనులు చేస్తున్నారన్నారు. విద్యుత్ అంతరాయం ఉన్నట్లయితే 1912 నెంబర్ కు సమాచారం అందించాలని, తడిచేతులతో విద్యుత్ పరికరాలు తాకవద్దని తెలిపారు.