బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒంగోలులో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి స్వామి సోమవారం మాట్లాడుతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.