కారు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

50చూసినవారు
కారు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం రాత్రి త్రిపురాంతకం మండలంలోని డివిఎన్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. అన్న సముద్రం గ్రామానికి చెందిన అబ్రహం తన పొలలో పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో కారు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అబ్రహం ను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్