త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో ఆదివారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 10 లక్షలతో నిర్మాణం చేపట్టబోతున్న సీ. సీ రోడ్ల పనులకు కొబ్బరికాయ కొట్టి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని గ్రామాల రోడ్లను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.