మిట్టపాలెం: మేకను చంపిన కొండ చిలువ
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలోని పంట పొలాల్లో మేకను కొండ చిలువ చుట్టేసి తినబోయిన సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జున అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు. 8 అడుగులు ఉన్న కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు ఆయన తెలిపారు. అయితే మేక మృతి చెందిందని కాపరి తెలిపారు.