నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన 110 మంది క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి ధనలక్ష్మి మాట్లాడుతూ క్రీడా పోటీలు నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్రీడా పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఉత్సాహం చూపించాలని తెలిపారు.