నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. గత ప్రభుత్వంలో రైతులకు విద్యుత్ మోటార్ లు ఇవ్వకుండానే 25 చోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై రైతులు ఆరోపణలు చేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి రూరల్ ఏఈ వెంకటేశ్వర్లును ఉన్నత అధికారులు గురువారం సస్పెండ్ చేశారు.