నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుపల్లి, కోటి తీర్థం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రాయితీ పై అందిస్తున్న విత్తనాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులందరూ రసాయనాలను తక్కువగా వాడాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.