ఎర్రగుంట్ల: ఈనెల 6న ప్రత్యేక విద్యుత్ అదాలత్
ఎర్రగుంట్ల, వీరపునాయునీపల్లి, కమలాపురం సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ఈనెల 6వ తేదీన జమ్మలమడుగులో విద్యుత్ అదాలతో నిర్వహిస్తున్నట్లు ఏఈ ప్రియదర్శన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు విద్యుత్ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలను విద్యుత్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలియజేశారు. జమ్మలమడుగులో 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.