కందుకూరు: మామిడి రైతులకు సస్య రక్షణపై శిక్షణ
మామిడి రైతులకు సస్య రక్షణ పై ఉలవపాడు మండల పరిధిలోని కే. రాజుపాలెం గ్రామం రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని మండల ఉద్యాన శాఖ అధికారి బి. జ్యోతి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ నెలలో మామిడి పూత రావడానికి తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు, యాజమాన్యం పద్ధతులను రైతులకు ఈ సందర్భంగా వివరించారు. అలాగే చీడపురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.