ఈనెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఉదయగిరి మండలం పరిధిలోని రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ సుభద్ర మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూ ఆక్రమణలు, రీ సర్వేకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశాలు జరుగుతాయని ఈ సమావేశాల్లో ప్రజలందరూ వారి యొక్క సమస్యలను విన్నవించి పరిష్కరించుకోవాలని తెలిపారు.