నెల్లూరు జిల్లా ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో భీకర వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి గంట గంటకు గ్యాప్ ఇస్తూ ఓ మోస్తరు వర్షం కురిసింది. కానీ రాత్రి వేళ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి భీకర వర్షం కురుస్తుంది. కాగా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఈ రెండు మండలాల్లో వర్షం పడట్లేదని నిరుత్సాహానికి గురైన రైతులకు ఈ వర్షం ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.