శింగనమల మండల కేంద్రంలోని శ్రీరంగరాయల చెరువు ఆయకట్టులో రైతులు వరి పంట సాగు కోసం కాలువలకు మరమ్మతులు చేస్తున్నట్లు టిడిపి నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు జేసిబిలతో కాలువలు శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.