గుత్తి పట్టణంలోని కోటవీధిలో ఉన్న అతి పురాతనమైన శ్రీ రామ స్వామి ఆలయాన్ని సోమవారం అనంతపురం జిల్లా పురావస్తు శాఖ అధికారి రాజా యోగేష్ సందర్శించారు. గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్, ఆలయ పూజారి, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురావస్తు శాఖ అధికారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం శిథిలావస్థకు చేరుకుందని ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.