కుంటను తలపిస్తున్న ఎమ్మెస్ ఫుట్ బాల్ క్రీడా మైదానం
గుత్తిలో గురువారం వర్షం కురిసి, వర్షం నీరు అంతా ఎమ్మెస్ ఫుట్బాల్ క్రీడా మైదానంలోకి చేరింది. వర్షం నీరు భారీగా క్రీడా మైదానంలోకి చేరడంతో కుంటను తలపించే విధంగా తయారయింది. మైదానమంతా వర్షం నీరు నిల్వడంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా వర్షం నీరు అంతా క్రీడా మైదానంలోకి చేరి క్రీడాకారులకు ఆటంకంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.