ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
గుంతకల్లు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని, తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ఈ పంట నమోదు ప్రక్రియను నాణ్యతగా చేపట్టేలా మానిటర్ చేయాలన్నారు. ఫ్రీ హోల్డ్ అయిన భూముల పునః పరిశీలన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయా కార్యాలయాల ద్వారా ప్రజలకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించాలన్నారు.