శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని లింగంపల్లి లో వెలసిన యల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి వేడుకున్నారు. ఆదివారం ఆలయ౦లో ఆశాఢ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం నుంచి అమ్మవారికి వివిధ అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతంరం పెండవ సంఖ్యలో మహిళలు బోనాలతో ఊరేగుతూ వచ్చి అమ్మవారికి సమర్పించారు.