విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడదామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ విజయవాడ వరద ఉద్రిక్తత వలన లక్షలాదిమంది ఇల్లు, ఆస్తులు కోల్పోయారని వారి సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. హిందూపురం పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల దగ్గర విజయవాడ వరద బాధితులకు సహాయనిది సేకరిస్తున్నట్లు తెలిపారు.