ఆమిదాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జబేజ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని, పిఈటి ప్రసూన షోకాస్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డెమొక్రటిక్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టుబడి గౌస్ లాజమ్, మారుతి ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ అసంబద్ధంగా ఉందని, దానిని తప్పనిసరిగా సవరించాలన్నారు.