పెనుకొండ పట్టణంలోని శాంతినికేతన్ పాఠశాల 45 వ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిధులుగా ఎం ఈ ఓ లు చంద్ర శేఖర్, సుధాకర్, జైలర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా గత సంవత్సరం 10 పరీక్షా ఫలితాలో స్టేట్ 4 వ ర్యాంక్, మండల 1, 2, 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు.