గాయపడిన జిల్లా యువజన విభాగ కార్యదర్శిని పరామర్శించిన బలసాని
గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వైసిపి జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి వంగా సీతారామిరెడ్డి గతవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సందర్భంగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన్ను పరామర్శించారు. జొన్నలగడ్డ గ్రామ సర్పంచ్ శిరీష , వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.