రామగిరి మండలం చెర్లోపల్లికి చెందిన వైసీపీ నాయకుడు రామకృష్ణ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోమవారం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.