అనంతపురం జిల్లా యాడికి లోని సాయిబాబా గుడిలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గొడ్డుమర్రి రామాంజనేయులు అనే వ్యక్తి ఆలయంలో ఉన్న కంచు సామగ్రిని దోచుకెళ్లాడు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు సీఐ ఈరన్న చైతన్య హిల్స్ వద్ద నిందితుడు రామాంజినేయులును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బుధవారం తెలిపారు.