స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఉరవకొండలో స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ కు నియోజకవర్గ వీరశైవ సంఘం నాయకులు దుశ్శాలువాతో సత్కరించి ఆహ్వానించడం జరిగింది. కలెక్టర్ తన మాతృభాష కన్నడంలో అందరిని పలకరించడం జరిగింది. ఉరవకొండ పట్టణ వీరశైవుల రుద్రభూమిలో కంప చెట్లను తొలగించి, కాంపౌండ్, వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించారు.