ఆమదాలవలస లక్ష్మీ నారాయణస్వామి ఆలయంలో వేద పండితులు అంపోలు రామాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు గురువారం ఘనంగా రుక్మిణి కళ్యాణం నిర్వహించారు. ధనుర్మాసం మార్గశిర ఏకాదశి సందర్భంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు నారాయణరావు, ప్రశాంత్, ఆలయ ధర్మకర్తలు, భగవద్గీత ప్రచార సభ్యులు, వికాస్ తరంగణి సభ్యులు ఉన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.