ఆముదాలవలస మండలంలోని చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు పలు దుకాణాలను సందర్శించి.. 18 సంవత్సరాలలోపు బాలబాలికలను పని నిమిత్తం చేర్చుకోకూడదని దుకాణదారులకు అవగాహన కల్పించారు. బుధవారం ఆముదాలవలస పట్టణంలో లేబర్ ఆఫీసర్ భాను ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సీఆర్ ఎంటీ శ్రీనివాసరావు, ప్రశాంత్ కుమార్ జ్యోతి, ధనలక్ష్మి, కోర్టు సిబ్బంది, సంస్థ ప్రతినిధులు ఆర్ చిరంజీవి, ఎన్ మురళి పాల్గొన్నారు.