బూర్జ తహశీల్దార్ కార్యాలయంలో బి ఎల్ ఓ సూపర్వైజర్లతో సమావేశం

82చూసినవారు
బూర్జ తహశీల్దార్ కార్యాలయంలో బి ఎల్ ఓ సూపర్వైజర్లతో సమావేశం
బూర్జ మండలంలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లతో బుధవారం సమావేశం నిర్వహించినట్లు మండల తహసిల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఎస్ ఎస్ ఆర్ 2025 ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేసే కార్యక్రమం పై ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్