రణస్థలం మండలంలోని దేరసాం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కోరాడ మాలచ్చి ఇంటి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి స్పందించిన దేరసాం జనసేన నాయకులు దన్నాన రవీంద్ర 5000 రూపాయల సహాయాన్ని అందించారు. గ్యాస్ సిలిండర్ కూడా కాలిపోవడంతో ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మహంతి గురు చరణ్ తో కలిసి, రవీంద్ర 5000 రూపాయల విలువ గల గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ ను ఉచితంగా అందించారు.