లావేరు మండలం పాతకుంకాం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరుమల తిరుపతికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో శుక్రవారం ఉదయం వారు తిరుపతి బయలుదేరారు. ఈ సందర్బంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వీరిని రణస్థలం మండలం పూసపాటిరేగ వద్ద దుస్సాలువాలతో సత్కరించారు.