జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీన్ కర్ పుండ్కర్ ను శ్రీకాకుళం నగరంలో శనివారము నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచము అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ సమస్య పై చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మీ సూచనలతో నరసన్నపేట నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.