గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం కొత్తూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన సమస్యలపై ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలో ఐ టి డి ఏ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ భూమికి పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ధర్నా ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.