పాతపట్నం నియోజకవర్గంలో 76 నీటి సంఘాలకు 76 గాను గెలుపొంది క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం చేసుకుని శతశాతం నీటి సంఘాలను కైవసం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. గెలుపొందిన అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, సభ్యులను ఎమ్మెల్యే ఆయన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.