ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం తహసిల్దార్ కార్యాలయంలో గార మండల ప్రజల నుంచి వినతల స్వీకరణ కార్యక్రమం ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు.