రెండు బైక్ లు ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు

71చూసినవారు
రెండు బైక్ లు ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు
టెక్కలి మండలం టెక్కలి-నౌపాడ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంతబొమ్మాళి మండలం కస్పా నౌపాడకు చెందిన వాకాడ జగన్ తన ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగి చంద్రమౌళి, ఆయన కుమార్తె లిఖితకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన జగన్ ను శ్రీకాకుళం తరలించారు.

సంబంధిత పోస్ట్