ఆ లేఅవుట్లకు అనుమతుల్లేవు

85చూసినవారు
ఆ లేఅవుట్లకు అనుమతుల్లేవు
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి అమీన్ సాహెబ్ పేట, బెల్లుపడ రెవెన్యూ పరిధిలో వేసిన పలు లేఅవుట్లకు అనుమతులు లేవని కమిషనర్ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్లు అమ్మకాలు, కొనుగోలు చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఈ లేఅవుట్లలో ఇళ్లు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని లేఅవుట్లకూ కచ్చితంగా అనుమతులు ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్