నరసన్నపేట ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే

66చూసినవారు
నరసన్నపేట ఏరియా హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. సోమవారం స్థానిక హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ సమావేశంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఈ హాస్పిటల్ కి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక వైద్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్