సీతంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
సీతంపేట మండలం పొల్ల గ్రామ సచివాలయ పరిధిలో సోమవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కూటమి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలను వినతుల రూపంలో స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.