వీరఘట్టం: లబ్ధిదారుని ఇంట్లో టీ పెట్టిన ఎమ్మెల్యే
వీరఘట్టం మండలంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పొందిన ఓ మహిళ ఇంటిని ఆదివారం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంట్లో గ్యాస్ వెలిగించి ఎమ్మెల్యే స్వయంగా టీ కాచారు. కాసేపు ఆ కుటుంబంతో ముచ్చటించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ గ్యాస్ స్కీమ్ పట్ల సదరు మహిళ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.