పాతపట్నం టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్య మంత్రి ఎన్. టీ రామారావు 29వ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆయన విగ్రహానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతను రాజకీయాలలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు.