ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ మాఫియాలో వాహన నిర్వాహకులే కీలక సూత్రధారులని పేర్కొన్నారు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వం రూ.1500 కోట్ల నష్టం కలిగించిందన్నారు. ఏండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంపై త్వరలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.