నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని సిద్దిపురం గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంగన్వాడి కేంద్రంలో పిల్లల సౌకర్యార్థం గుడిపల్లి వెలసిత కుర్చీలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంగన్వాడీ కార్యకర్త గ్రామస్తులు పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్ర అభివృద్ధి తమ వంతు తోడ్పాటు అందిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు.