భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని శనివారం సిమ్స్ బ్లడ్ బ్యాంకులో 20 మంది దాతలు రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే రీతిలో యువత ఉండాలని, రోగులకు రక్తం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడినట్లు ఉంటుందని దాతలు పేర్కొన్నారు. రక్త దానం చేసిన వారిలో పట్టా మునిదీప్, ఎల్ కె. నాయుడు, లలిత్, సాయిరాం, నవీన్, మహమ్మద్ రఫీ, బాలాజీ తదితరులు ఉన్నారు.