తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట కూడలి పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు చంద్రగిరి మండలం ఏ. రంగంపేటకు చెందిన యోగనంద్, రెడ్డి తేజలుగా స్థానికులు గుర్తించారు. తిరుపతి నుంచి ఏ. రంగంపేటకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.