తిరుపతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

62చూసినవారు
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో హథీరాంజీ మఠం భూములు ఉన్నాయి. ఇందులో శివ నాయక్ అనే వ్యక్తి నిర్మాణాలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న మఠం పరిపాలనాధికారి కేఎస్ రామారావు గురువారం ఉదయాన్నే భూముల వద్దకు వెళ్లారు. నిర్మాణాలను తొలగించారు. విషయం తెలుసుకున్న శివ నాయక్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. నిర్మాణాలను కూల్చడం అన్యాయమని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్