బొమ్మయ్యపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు

74చూసినవారు
బొమ్మయ్యపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్య పల్లి సర్పంచ్ గోవిందయ్య చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు దేవళంపేట వార్డు సభ్యుడు పయని కలెక్టర్ , డీపీవోలకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిధులు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ కావడంతో చెక్ పవర్ రద్దు చేసినట్టు అందులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్