కుప్పం: భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్సీ

85చూసినవారు
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కేజీబీవీ పాఠశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శనివారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్