పదేళ్లుగా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా కేవలం మాటలకే పరిమితమయ్యారు కానీ అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే భాను ప్రకాష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కుశస్థలీ నదిలో వరద ఉద్ధృతికి వంతెన కొట్టుకుపోయిందన్న సమాచారం అందుకున్న ఆయన వంతెనను పరిశీలించారు. ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత గాలి ముద్దుకృష్ణమనాయుడిదే అన్నారు. త్వరలోనే వంతెనను నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.