ఈనెల 26వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని నగరి ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈకార్యక్రమానికి సంబంధించి సోమవారం నగరి పట్టణంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఉదయం 10 గంటలకు నగరి లోని పార్టీ కార్యాలయానికి టిడిపి శ్రేణులు చేరుకోవాలని ముఖ్య నాయకులు తెలిపారు.